కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిపై పోరు చేసేందుకు ఉత్తరాఖండ్ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ప్రతీ ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్ మెంట్ ఫండ్స్ కు 2 సంవత్సరాల వరకు రూ.1 కోటి చొప్పున నిధులను నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి మదన్ కౌశిక్ తెలిపారు.