ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణకు అధికారులు, ప్రజా ప్రతినిదులు సిద్ధం కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ నిర్మల్ పట్ణణంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ, విధులపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కర్తవ్య బోధ చేశారు.
పల్లె ప్రగతికి సిద్ధం కావాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి