భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ (ఓఎస్డీ)గా అట్ల రమణా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రమణా రెడ్డి జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రమణా రెడ్డి కరీంనగర్ జిల్లా గంగవరం మండలం రాళ్లపల్లి గ్రామం నుండి 2012 బ్యాచ్ లో డీఎస్పీగా ఎంపికై.. మొదట బెల్లంపల్లిలో విధులలో చేరారు. ఆ తర్వాత కోదాడ, ఏటూరునాగారం, సీఐడీలలో డీఎస్పీ గా పనిచేసి పదోన్నతిపై అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీగా రమణా రెడ్డి